మంగళసూత్రం, ఉంగరంతో అడ్డంగా దొరికిపోయిన సోనమ్
మేఘాలయ హనీమూన్ కేసులో సోనమ్ దొరికిపోడానికి మంగళ సూత్రం, ఉంగరం కూడా కారణమని తెలుస్తోంది.
మేఘాలయ హనీమూన్ కేసులో సోనమ్ దొరికిపోడానికి మంగళ సూత్రం, ఉంగరం కూడా కారణమని తెలుస్తోంది. తప్పిపోకముందు రాజా రఘువంశీ, సోనమ్ బసచేసిన హోటల్‌లో మంగళసూత్రం, ఉంగరం లభించాయి. దర్యాప్తులో నిందితురాలిని పట్టించడానికి కారణమయ్యాయని పోలీసులు తెలిపారు.
కొత్తగా పెళ్లి అయిన మహిళ గదిలోనేే మంగళసూత్రాన్ని, ఉంగరాన్ని పెట్టి వెళ్లడం అనుమానాలను కలిగించిందని, ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా ఓ పోలీసు అధికారి వెల్లడించారు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ మే 23న జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి కిరాయి హంతకులకు చెల్లింపులు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.