నా చావుకు భార్య, అత్త మామలే కారణం.. హుస్సేన్ సాగర్ లో దూకి

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ భార్య, అత్తింటి వేధింపులు భరించలేక ఒక యువకుడు మరణించాడు

Update: 2026-02-10 06:37 GMT

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ భార్య, అత్తింటి వేధింపులు భరించలేక ఒక యువకుడు మరణించాడు. హుస్సేన్ సాగర్ లో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి బలవన్మరణం పొందారు. ఈ ఘటన లేక్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డికి మరొక యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఈ దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు.

కొద్ది రోజుల తర్వాత వచ్చిన...
గతంలో భార్య ఇన్‌స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చిందిని పోలీసులు తమ విచారణలో మృతుడి కుటుంబ సభ్యుెలు వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది.భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి హుస్సేన్‌ సాగర్‌లో దూకాడు.
వారే కారణం...
సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్‌ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్‌లో స్టేటస్‌ పెట్టుకున్నాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. నిందితులను పట్టుకుని విచారిస్తే కాని అసలు విషయం బయటపడుతుందని తెలిపారు. ప్రస్తుతం మృతుడి స్టేటస్ తో వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News