పారిస్ నుండి వచ్చింది.. ఆ బాక్స్ లో ఉన్నవేమిటో తెలుసా..?

Update: 2022-10-24 01:46 GMT

ముంబై: వేరే దేశం నుండి వచ్చిన కొరియర్ ద్వారా.. ఏ మాత్రం భయం లేకుండా డ్రగ్స్ ను భారతదేశంలోకి తరలించాలని అనుకున్నారు. భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలతో కూడిన పార్శిల్‌ను ముంబై లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లో ఆదివారం పసిగట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ కొరియర్ పార్శిల్ ద్వారా భారత్‌లోకి మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ అయ్యే అవకాశం ఉందన్న సమాచారం ఆధారంగా, ముంబైలోని డిఆర్‌ఐ అధికారులు అక్టోబర్ 20న ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లో పార్శిల్‌ను పట్టుకున్నారు.


పార్శిల్ పారిస్‌ నుండి ముంబై శివార్లలోని నలసోపరా చిరునామాకు చేరుకోవాల్సి ఉంది. పార్శిల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో ₹ 15 కోట్ల కంటే ఎక్కువ విలువైన టాబ్లెట్ల రూపంలో 1.9 కిలోల యాంఫెటమైన్ రకం పదార్థం రికవరీ అయినట్లు అధికారులు తెలిపారు. మెటీరియల్ బాడీలో దాచిన పాలిథిన్ ప్యాక్‌లలో టాబ్లెట్‌లను ప్యాక్ చేశారు. పార్శిల్ ఎవరికోసమైతే డెలివరీ చేయబడిందో ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అతన్ని విచారిస్తూ వెళ్లగా.. పార్శిల్ అంతిమంగా నైజీరియన్ దేశస్థుడికి వచ్చినట్లు తేలింది. పార్శిల్‌ను స్వీకరించేందుకు వచ్చిన నైజీరియా దేశస్థుడిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నైజీరియా జాతీయుడితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News