తాళి మీద తాళి కట్టి.. ఆస్తులను తెగ నమ్మేసి.. ఉన్నవన్నీ దోచుకుని?

గతంలోనే పెళ్లయి భార్య, పిల్లలున్నా వారు కరోనా తో చనిపోయారని నమ్మించి మోసం చేసి వివాహితను పెళ్లిచేసుకుని ఆస్తిని కాజేసుందుకు ప్రయత్నించాడు

Update: 2025-07-08 06:12 GMT

ఆస్తి కోసం ఎంతకైనా తెగించే వారు నేటి కాలంలో ఉన్నారు. కేవలం డబ్బుల కోసం హతమార్చేవారు కొందరయితే అమాయక మహిళలను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసే వారు మరికొందరు. చిత్తూరు జిల్లాలో ఒక వివాహితను పెళ్లాడిన ఒక వ్యక్తి ఆస్తి మొత్తం కాజేసి పరాయిన ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తికి గతంలోనే పెళ్లయి భార్య, పిల్లలున్నా వారు కరోనా తో చనిపోయారని నమ్మించి మోసం చేసి వివాహితను పెళ్లిచేసుకుని ఆస్తిని కాజేసుందుకు ప్రయత్నించాడు. మొత్తం 28 కోట్ల రూపాయలను కాజేసిన సదరువ్యక్తి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజ్ పేట్ కు చెందిన నాగమణికి యాభై ఏళ్లు. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా, తర్వాత భర్త వెంకటరెడ్డి కూడా అనారోగ్యంతో మరణించాడు.

కోట్ల రూపాయల ఆస్తి నుంచి...
భర్త నుంచి సంక్రమించిన ఆస్తి కోట్ల రూపాయలు ఉంది. అయితే నాగమణి తనకు ఒక తోడు కావాలని భావించి మళ్లీ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మంచి వ్యక్తిని చూడాలంటూ బ్రోకర్ ను కలిసింది. అయితే ఆ బ్రోకర్ నాగమణికి ఆస్తులున్నాయని, మంచి సంబంధం ఉంటే చూడాలని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ కు ఈ విషయం చెప్పింది. అయితే నాగమణి ఆస్తులపై కన్నేసిన శివప్రసాద్ తానే పెళ్లి చేసుకుంటే పోలా? అని ప్లాన్ వేశాడు. భార్య, కుమార్తె కరోనాతో మరణించారని, తాను ఒంటరివాడినని చెప్పినాగమణిని శివప్రసాద్ నమ్మించాడు. డెత్ సర్టిఫికేట్లు కూడా చూపారు. దీంతో వాటిని నమ్మిన నాగమణి 2022లో శివప్రసాద్ ను వివాహం చేసుకుంది.
కాజేయాలని...
అయితే ఆమె ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసిన శివప్రసాద్ నాగమణికి మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆర్బీఐ నుంచి తనకు కోట్ల రూపాయలు రానున్నాయని చెప్పి కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు చూపించి ఈ సొమ్ము తన ఖాతాలో పడాలంటే కొంత మొత్తాన్ని ఆర్బీఐకి చెల్లించాలని చెప్పాడు. శివప్రసాద్ మాయమాటలను నమ్మిన నాగమని తన వద్ద ఉన్న ఆస్తులను, డబ్బులను అతని ఖాతాల్లో వేసింది. నాగమణి సంతకాలు ఫోర్జరీ చేసిన ఆమె వద్ద ఉన్న పదిహేను కోట్ల విలువైన భూమిని, పది కోట్ల విలువైన భవనాన్ని విక్రయించేశాడు. ఆమె బంగారు ఆభరణాలను కూడా బ్యాంకుల్లో కుదువ పెట్టాడు. చివరకు ఆభరణాలు తనకు కావాలని, వివాహానికి వెళ్లాలని కోరడంతో శివప్రసాద్ పరారయ్యాడు.దీంతో నాగమణి శివప్రసాద్ కోసం బంగారుపాళ్యం వెళ్లగా అప్పటికే అతనికి కుమార్తె, భార్య ఉన్నారని తెలిసి నాగమణి విస్తుపోయింది. దీంతో నాగమణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి శివప్రసాద్ కోసం వెదుకుతున్నారు.
Tags:    

Similar News