America : అమెరికాలో కాల్పులు... ముగ్గురు మృతి
అమెరికాలో మరొకసారి కాల్పుల కలకలం రేగింది. మెన్నెసోటా మినియాపోలిస్ లోని ఒక పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
అమెరికాలో మరొకసారి కాల్పుల కలకలం రేగింది. మెన్నెసోటా మినియాపోలిస్ లోని ఒక పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పాఠశాలలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
పదిహేడు మందికి గాయాలు...
అయితే ఈ కాల్పుల ఘటనలో పదిహేడు మంది వరకూ గాయాలయ్యాయి. గాయాలయిన పదిహేడు మందిలో పథ్నాలుగు మంది చిన్నారులున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు ప్రార్ధన చేస్తున్న సమయంలో దుండగుడు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తికి ఇరవై ఏళ్ల వయసు లోపే ఉంటుందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు