16 ఏళ్లకే కన్నతల్లిని కాటికి పంపింది

16 సంవత్సరాల బాలిక. అమ్మ చున్నీతో ఉరివేసుకుని చనిపోయిందంటూ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పింది.

Update: 2025-06-25 09:45 GMT

16 సంవత్సరాల బాలిక. అమ్మ చున్నీతో ఉరివేసుకుని చనిపోయిందంటూ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పింది. కానీ పోలీసులు బాలికను గట్టిగా ప్రశ్నించగా 19 ఏళ్ల ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది. మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తి మండల కేంద్రానికి చెందిన సట్ల అంజలి తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో కళాకారిణి. ఇద్దరు కుమార్తెలతో కలిసి షాపూర్‌నగర్‌ హెచ్‌ఎంటీ సొసైటీలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెకు నల్గొండ జిల్లా కట్టంగూర్‌కి చెందిన డీజే నిర్వాహకుడు శివ తో పరిచయమైంది. ఇది ప్రేమగా మారినట్లు తెలుసుకున్న అంజలి కుమార్తెను మందలించారు. అయినా మార్పు రాకపోవడంతో ఆమెకు, తల్లికి ఒకసారి పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లిని చంపేద్దామని బాలిక చాటింగ్‌ ద్వారా శివకు చెప్పగా తొలుత నిరాకరించాడు. కానీ ఆ తర్వాత బాలిక ఒత్తిడి కారణంగా శివ, అతడి సోదరుడితో కలిసి తల్లి మెడకు చున్నీతో బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేయించింది. నిందితులు ముగ్గుర్నీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News