పెళ్లయిన 29 రోజులకే పక్కా ప్లాన్ తో!!

ప్రియుడి వ్యామోహంలో నెల రోజుల వ్యవధిలోనే భర్తను చంపించింది.

Update: 2025-06-24 10:15 GMT

ప్రియుడి వ్యామోహంలో నెల రోజుల వ్యవధిలోనే భర్తను చంపించింది. గద్వాలకు చెందిన సర్వేయర్‌ గంటా తేజేశ్వర్‌ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తేజేశ్వర్‌కు ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్‌ సహస్రతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించారు. అప్పటికే స్థానికుడైన ఓ బ్యాంకు ఉద్యోగి, వివాహితుడైన తిరుమలరావుతో ప్రేమాయణం సాగించిన ఐశ్వర్య పెళ్లిని రద్దు చేయించింది. మళ్లీ మే నెలలో తేజేశ్వర్‌కి ఫోన్‌ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కట్నకానుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి వద్దన్నానని నమ్మించింది. అయితే ఎలాంటి కానుకలు లేకుండా మే 18న బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు.

తేజేశ్వర్‌ గద్వాలలో కాపురం ఉండటంతో ప్రియుడిని కలుసుకోవడం వీలుకాలేదు. దీంతో తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావులు కర్నూలుకు చెందిన ఓ సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నారు. భూమి సర్వే చేయాల్సి ఉందని జూన్ 17న కారులో తీసుకుని వెళ్లారు. గద్వాల మండలం వీరాపురం లోని కృష్ణస్వామి ఆలయం సమీపంలో మారణాయుధాలతో చంపేశారు.

Tags:    

Similar News