ఆమె అమాయకురాలు.. ఫోన్ లో మాకు చెప్పింది ఇదే: సోనమ్ తండ్రి

హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2025-06-10 09:15 GMT

హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి పలు కోణాలలో విచారణ జరుపుతూ ఉన్నారు. రఘువంశీ భార్య సోనమ్ మీద వచ్చిన ఆరోపణలను ఆమె తండ్రి తప్పుబట్టారు. తన కుమార్తె అమాయకురాలని, మేఘాలయ పోలీసులు ఆమెపై తప్పుడు కేసు బనాయించి ఇరికించారని ఆరోపించారు.


ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని తెలిపారు. ఎవరో కిడ్నాప్ చేసి, దోచుకోవడానికి ప్రయత్నించారని సోనమ్ ఫోన్‌లో చెప్పిందని, తాను ఘజియాబాద్‌కు ఎలా వచ్చానో కూడా తనకు తెలియదని చెప్పిందని ఆయన అన్నారు.

Tags:    

Similar News