Road Accident : మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు చిన్నారులుతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు.
దర్గాలో నిద్ర చేయడం కోసం...
హైదరాబాద్ లోని షాపూర్ నగర్ కు చెందిన ఒక ఫ్యామిలీ కొల్చారం దర్గాలో నిద్ర చేయడం కోసం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో షాపూర్ నగర్ లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆలీ, అజీ బేగం, ఏడాది బాలుడు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.