తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

Update: 2025-07-02 12:13 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ధర్మవరం జరిగిన ప్రమాదంలో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించారు. మృతులందరూ వనపర్తి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కారును వేగంగా ఢీకొట్టడంతో...
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వీరంతా తమిళనాడు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News