Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలసీులు నిర్ధారించారు. అత్యంత వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులతోపాటు ఆటో డ్రైవర్ కూడకా మరణించారు.ఇందులో మహిళ కూడా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం...
ఐదుగురు గాయపడగా...
ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశాలోని అంగులాంగుల్ వద్ద ఖండహట వంతెన సమీపంలో వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో అది పల్టీలు కొట్టడంతో పాటు అందులో ఉన్న బన్షిధరసేథి, కమలా సేథితో పాటు ఆటో డ్రవర్ మంతు ముదులిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.