Road Accident : ముంబయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి...మూడు రోజులైన కనుక్కోలేని వైనం
ముంబయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు.
ముంబయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. అయితే ఈ ప్రమాదం జరిగి మూడు రోజులయినా ఎవరూ గుర్తించలేదు. కారు లోయలో పడటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే అక్కడ పశువుల కాపరి ఒకరు కారు లోయలోపడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
త్రయంబకేశ్వర్ కు వెళుతుండగా...
ముంబయి నుంచి నాసిక్ వెళ్లే జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. మూడు రోజుల క్రితం వేగంగా వచ్చిన ఈ కారు లోయలో పడటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. మృతులు ముంబయికి చెందిన వారిగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ముంబయి నుంచి త్రయంబకేశ్వర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.