Road Accident : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది స్పాట్ డెడ్
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. మధ్యప్రదేశ్ లోని ఝుబువా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న వ్యానును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలపిారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతుండగా, నిద్రలేమి, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చంెదిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.