Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఒక బస్సుతో ప్రయివేటు వాహనం ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. బసవన బాగేవాడి తాలుకాలోని మనగులి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రయివేటు వాహనంతో బస్సు ఢీకొట్టి....
విజయ్ పుర పోలీసుల కథనం ప్రకారం షోలాపూర్ వైపు వెళుతున్న ప్రయివేటు వాహనాన్ని ముంబయి నుంచి బళ్లారికి వస్తున్న ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు, బస్సులోని ఒకరు స్పాట్ లోనే మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారనిపోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని తెలిసింది.