Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం కాటావరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కంటెయినర్ ను ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అత్యంత వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. బస్సులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రయివేటు బస్సు...
ప్రయివేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డెబ్భయి ఏళ్ల అప్రస్ ఉన్నిసా, ముప్ఫయి ఐదేళ్ల హసన్, నలభై ఐదేళ్ల ఎల్లమ్మలు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం, నిద్రమత్తువల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.