మేడ్చల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మేడ్చల్ జిల్లా ఘర్ కేసర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదులాబాద్ లో అర్ధరాత్రి విద్యుత్తు స్థంభాన్ని కారు ఢీకొట్టడతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మరణించారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మరొకరి పరిస్థితి విషమం...
ఎదులాబాద్ నుంచి కుంటూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ లు ప్రయాణిస్తుండగా అందులో భార్గవ్ యాదవ్, వర్షిత్ స్పాట్ లోనే మృతి చెందారు. దినేష్ పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.