Road Accident : కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు

Update: 2025-06-20 04:34 GMT

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మండంల విరవ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఐషర్ వ్యాన్ తో ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరొకరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆటో ఢీకొని...
ఈ ప్రమాదంలో మల్లాం గ్రామానికి చెందిన కాల్దారి రాజబాబు, గలింక కన్నబాబు, విరవ గ్రామానికి చెందిన గుద్దాటి చినబాబు మరణించారు. మల్లాం నుంచి విరవకు ఆటోలో వస్తుండటంతో మలుపు వద్ద ఐరన్ లోడ్ తో వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పిఠాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags:    

Similar News