ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మాసెరాన్ వద్ద లోయలో బస్సు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ప్రమాదంలో మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయాలుపాలయిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో...
హిమాచల్ రాష్ట్రంలోని మండికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను లోయలో పడిన బస్సు నుంచిబయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం ఇరవై మంది ప్రయాణికులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.