Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతుడగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. కారులో నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
మృతులు మహారాష్ట్రకు చెందిన...
మృతులు శ్రీకర్, తుషార్, కార్తీక్ లుగా గుర్తించారు. మరొక వ్యక్తి సుమిత్ తీవ్రంగా గాయపడ్డారు. సుమిత్ ను ఉరవకొండ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. మృతులందరూ మహారాష్ట్రలోని శివగావ్ లోని అహ్మదానగర్ కు చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని తెిసింది. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.