పంజాబ్ లో ఘోర ప్రమాదం .. ఐదుగురి మృతి
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. పంజాబ్ లోని శ్రీముక్త్ సర్ సాహిజ్ జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. కర్మాగారంలో బాణా సంచా తయారు చేస్తున్న ఐదుగురు కార్మికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
పేలుడు తో...
ఈ ఘటనలో మరికొందరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే మృతులు ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం సహాయక చర్యలు పూర్తి చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.