Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిత్తూరు వాసుల మృతి
కర్ణాటక హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముగ్గురు మరణించారు
కర్ణాటక హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముగ్గురు మరణించారు. లారీ, చిత్తూరు ఆర్టీసీ బస్సుపరస్పరం ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతులుముగ్గురు చిత్తూరు జిల్లాకుచెందిన వారిగా గుర్తించారు.
అతి వేగమే...
అయితే అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.