ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2025-03-07 12:42 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 29 మందికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలోని కేజీ కందిగై రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు, లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

అతి వేగమే కారణమని...
గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, లారీ ఢీకొట్టుకోవడంతో ఆ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు క్రేన్లతో వాటిని తొలగిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News