తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేట్ వాహనంతో ప్రభుత్వ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేట్ వాహనంతో ప్రభుత్వ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. తమిళనాడులోని తంజాావూరు- తిరుచిరాపల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై సెంకిప్పటి వంతెన సమీపంలో బస్సు వేగంగా వచ్చిప్రయివేటు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ప్రయివేటు వాహనంలో ఉన్న ఐదుగురు మరణించారు.
అతివేగమే ప్రమాదానికి...
ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించనున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా భావిస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.