Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

Update: 2025-05-13 04:25 GMT

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. మినీ లారీతో మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

నిద్రమత్తుతో పాటు...
అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తుతో పాటు అతి వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గాయాలపాలయిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల ఎవరన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News