Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు స్పాట్ డెడ్
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు వెళుతున్న వాహనం బోల్తాపడింది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయానికి చెందిన వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు వెళుతున్న వాహనం బోల్తాపడింది. ఈఘటనలో డ్రైవర్ తో పాటు ముగ్గురు విద్యార్థులు మరణించారు. మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేద పాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపిని చూసేందుకు బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక వాహనంలో వీరు ప్రయాణిస్తున్నారు.
హంపీలో జరుగుతున్న...
హంపిలో జరుగుతనన నరహరి తీర్థుల ఆరాధనకు పథ్నాలుగు మంది మంత్రాలయం విద్యార్థులు హంపి ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. అయితే కర్ణాటకలోని సింధనూరులో వాహనం తిరగబడింది. దీంతో డ్రైవర్ శివతో పాటు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర, అక్కడికక్కడే మరణించారు. కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సింధనూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి క్షతగాత్రులకు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అధికారులను ఆదేశించారు.