Road Accident : తుని వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు

Update: 2025-05-17 03:07 GMT

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరికి గాయాలు...
మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజమండ్రికి చెందిన గెడ్డం రామరాజు, హజరత్ అలి, తణుకుకు చెందిన పరాడ సుధీర్ గా గుర్తించారు. విశాఖపట్నానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News