నిద్రమత్తులో వాహనం లోయలోకి.. ఐదుగురు స్పాట్ డెడ్
జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లిన వాహనం లోయలోపడటంతో ఐదుగురు మరణించారు
జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లిన వాహనం లోయలోపడటంతో ఐదుగురు మరణించారు. ఈ ఘోర ప్రమాదం జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని రాంబన్ జిల్లాలో జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటే స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకుని లోయలోపడిన వాహనాన్ని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సం అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి రహదారి సరిగా కనపడకపోవడం, డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.