Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని జరిగిన ఈ ప్రమాదంలో ఒక కుటుంబంలో మొత్తం ఈ ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కారు అదుపు తప్పి...
కొండప్రాంతం కావడంతో పాటు వర్షాలు కురుస్తుండటంతో కారు ఒక రాయిని ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాజేష్ హన్సో, ఆయన భార్య, కుమార్తె ఆర్తి, కుమారుడు దీపక్, బావమరిది హిమరాజ్ తో పాటు మరొక వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు.