Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. బైకును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదలో చిత్తూరు జిల్లా కుప్పం రూరల్ మండలం అనిమిగానిపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
మృతులు కుప్పానికి చెందిన...
మృతులను లోకేశ్, వెంకటేశ్ లుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కూడా ప్రమాదానికి గల కారణమని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.