Road Accident : ఏపీలో రోడ్డు యాక్సిడెంట్ .. ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలమూరివారిపల్లి వద్ద కారు రోడ్డు పక్కనున్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. అయితే కారులో హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళుతున్నట్లు తెలిసింది.
కర్ణాటకు చెందిన వారుగా...
మృతులు కర్ణాటకుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. బావిలో పడిన కారుతో పాటు మరణించిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.