అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనం
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనమయింది.
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనమయింది. గ్రీన్‌కౌంటీ ఏరియాలో కారును ఢీకొన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవ దహనమయ్యారు. విహార యాత్రకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్ లో వచ్చిన ట్రక్ంకు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వారంతా మరణించారు.
అట్లాంటా వెళ్లి వస్తుండగా...
మృతులు హైదరాబాద్ లోని తిరుమల గిరికి చెందిన వారు. బెజిగం శ్రీవెంకట్, చొల్లేటి తేజ్వసిని, సిద్ధార్థ, మృదాలు నలురుగు మరణించారు. వెంకట్, తేజస్వినికి 2013లో వివాహం కాగా వీరికి ఇద్దరు పిల్లలు. ఉద్యోగరీత్యా డల్లాస్ వెళ్లి స్థిరపడిన వెంకట్ కుటుంబం అట్లాంటాలోని తన మామ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్మరాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.