Murder Case : బాల్య స్నేహితుడి చేతిలో బలయిన వివాహిత.. కత్తితో చంపేసి?
Murder Case : బాల్య స్నేహితుడి చేతిలో బలయిన వివాహిత.. కత్తితో చంపేసి?
తనను పెళ్లి చేసుకోకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుందన్న కారణంతో ఒక వివాహితను దారుణంగా స్నేహితుడు హత్య చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. బాల్యస్నేహితుడి చేతిలోనే బలయింది. అయితే ఆమెను హత్య చేసిన అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని యల్లాపుర పట్టణంలో ఉంటున్న రఫిక్ ఇమామ్ సాబ్ చదువుకునే రోజుల నుంచి తన స్నేహితురాలు రంజిత బససోడే అంటే ఇష్టం. ఇద్దరూ పాఠశాల నుంచి చదువుకోవడంతో రఫిక్ రంజితను ప్రేమించాడు.
వివాహానికి అంగీకరించకపోవడంతో...
అయితే రఫిక్ ను వివాహం చేసుకునేందుకు రంజిత అంగీకరించలేదు. అంతేకాదు ఆమె రఫిక్ ను ప్రేమించలేదు. తర్వాత పన్నెండేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుని జీవితంలో సెటిలయింది. అయితే వీరికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొన్ని కారణాలతోతన భర్త సచిన్ నుంచి విడిపోయి రంజిత వేరుగా ఉంటుంది. యల్లాపురలోని తన కుటుంబంతో నివసిస్తుంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన అటెండర్ గా పనిచేస్తుంది.
అడవుల్లోకి వెళ్లి...
అయితే స్నేహితుడిగా రంజిత ఇంటికి తరచూ రఫిక్ భోజనానికి వచ్చేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని రంజితను రఫిక్ వత్తిడి తెస్తున్నాడు. అయితే రఫిక్ తో పెళ్లికి రంజిత, ఆమె కుటుంబ సభ్యులు అంగీకరింలేదు. దీంతో రఫిక్ తనతో వివాహం చేసుకోవడానికి రంజిత నిరాకరించిందని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రఫిక్ రంజితపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపర్చాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా రంజిత మరణించింది. అయితే రంజిత చనిపోయినట్లు తెలుసుకున్న రఫిక్ కూడా అడవుల్లోకి వెళ్లి ఉరేసుకుని మరణించాడు. మద్యం తాగి రఫిక్ బలవన్మరణం పొందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు