Road Accident : జాతీయ రహదారిపై లారీలు ఢీ - ముగ్గురి మృతి
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరిపెడ శివారులోని కుడియాతంగా వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో పాటు వేగంగా రావడంతో లారీ క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అతి వేగమే...
ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు లారీలకు చెందిన డ్రైవర్లతో పాటు క్లీనర్ కూడా మరణించాడు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీమంటల్లో తగలపడటంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గ కారణంగా తెలుస్తోంది.