Road Accident : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కోదాడ మండలం దుర్గాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
కోదాడ మండలం దుర్గాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వేగంగా వస్తున్న కారు వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు గాయపడటం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎస్ఐతో పాటు కానిస్టేబుల్...
మృతి చెందిన వారు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ నిద్రలేమి అని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.