Road Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ముప్ఫయి మందికి గాయాలయ్యాయి

Update: 2025-09-06 03:08 GMT

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ముప్ఫయి మందికి గాయాలు కాగా వారిలో ఐదు మంది కి తీవ్ర గాయాలయ్యాయి. నాయుడుపేట –పూతలపట్టు ప్రధాన రహదారిలోని చంద్రగిరి మండలం, అగరాల పంచాయితీ సమీపంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సు...
శనివారం తెల్లవారుజామున ముందు వెళ్ళుతున్న గ్రానైట్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 48 మంది ప్రయాణికులతో బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. గాయపడిన వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలింపు.


Tags:    

Similar News