Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం స్టేజీ వద్ద లారీని వెనక నుంచి ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సు బ్రేక్ డౌన్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
ప్రయివేటు ట్రావెల్స్ బస్సు...
అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మరణించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జాతీయ రహదారిపై జరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వచ్చి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.