Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదం.. ఆరుగురి మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. జిల్లాలోని కొమరరోలు మండలం తాటిచర్లమోటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు - లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు చీరాలకు సమీపంలోని స్టువర్టుపరం వాసులుగా పోలీసులు గుర్తించారు.
మహానందికి వెళ్లి వస్తుండగా...
మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారని, అందులో ఆరుగురు చనిపోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని తెలిసింది.