తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి

Update: 2025-02-14 04:57 GMT

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాముదిగొండ మండల కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది. టర్నింగ్ వద్ద గ్రానైట్ తో వెళుతున్న లారీ బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడటంతో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్రానైట్ లారీ బోల్తాపడటంతో...
వాహనం బోల్తాపడటంతో దానిపై కూర్చుని ప్రయాణిస్తున్న వారిపై గ్రానైట్ రాళ్లుపడి చనిపోయారు. మృతులు ఖమ్మం సమీపంలోని ఖానాపూర్ హవేలీకి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు.


Tags:    

Similar News