Road Accident : మితిమీరిన వేగం.. నలుగురి మరణం

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు

Update: 2025-05-26 06:58 GMT

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. జిల్లాలోని కొంతమూరు వద్ద కారు - లారీ ఢీకొనడంతో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. గాయలపాలయిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిసింది. అయితే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

ఢీకొట్టడం వల్లనే...
వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉండగా అందులో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారని పోలీసులు తెలిపారు. అయితే మృతులు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు


Tags:    

Similar News