Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించారు. రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో్ ఈ ప్రమాదం జరిగింది. బాపల్ట జిల్లా తిమ్మరాజు పాలెం వద్ద లారీ బోల్తా పడింది. ఈ లారీలో గ్రానైట్ రాళ్ల లోడు ఉండటంతో వాటి కింద పడి ముగ్గురు కార్మికులు నలిగిపోయారని పోలీసులు తెలిపారు. మార్టూరు నుంచి చిలకలూరిపేట మీదుగా గుంటూరు వెళుతుండగా పర్చూరుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అతి వేగమే...
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతులు మార్టూరుకు చెందిన పాలపర్తి శ్రీను, తాళ్లూరి ప్రభుదాస్, నూతలపాడుకు చెందిన తమ్ములూరి సురేంద్రగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.