ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి

పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్రయాణీకులతో నిండిన బస్సు హైవే

Update: 2023-08-04 02:41 GMT

పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయాణీకులతో నిండిన బస్సు హైవే నుండి లోయలో పడటంతో 18 మంది మరణించారు.. ప్రయాణీకులు ఎక్కువగా విదేశీయులు, కొంతమంది అమెరికా సరిహద్దుకు వెళుతున్నారని మెక్సికో అధికారులు తెలిపారు. ఉత్తర సరిహద్దు పట్టణమైన టిజువానాకు వెళ్లే మార్గంలో, బస్సులో భారతదేశం, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికన్ దేశాల పౌరులతో సహా 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులు సహా 18మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 23మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

నయారిట్​ రాష్ట్ర రాజధాని టెపిక్​కు సమీపంలోని బరాంక బ్లాంకాలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను గుర్తించేందుకు కష్టంగా ఉందని సమాచారం. మెక్సికో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత బస్సు డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. బస్సును అతివేగంగా నడపటమే ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.


Tags:    

Similar News