ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో కారు అదుపు తప్పి కాల్వలో పడింది. కారులో ఉన్న ఐదుగురు కారులోనే మరణించారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
కారు అదుపు తప్పి...
ధఖేర్వా గిరిజాపూరి హైవేపై వెళుతున్న కారు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. ప్రమాదం సమయంలో కారులో ఆరుగురున్నారని పోలీసులు తెలిపారు. అతి వేగమే కారు కాల్వలో పడటానికి కారణమని పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.