కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
కరీంనగర్‌లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో
karimnagar road accident
కరీంనగర్‌లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ వైపు నుంచి వెళ్తున్న కారును శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఆకాశ్ (22), ఏంపేడుకు చెందిన శ్రావణ్ (32)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
హుజురాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న ఓ కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారి పైన, బతుకమ్మ ఘాట్ మూల వద్ద 2 గంటలకు కరీంనగర్ వైపు నుండి హుజురాబాద్ వైపు వెళుతున్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారులోనే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి హెడ్ కానిస్టేబుల్ లతీఫ్ ఘటన స్థలానికి చేరుకున్నారు.