Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద లారీ టెంపోను ఢీకొట్టగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో పదకొండు మందికి గాయాలయ్యాయి.
పదకొండు మందికి గాయాలు...
గాయపడినవారిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ముగ్గురు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారుగాపోలీలసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం, నిద్రలేమితో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.