మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

బుల్దానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బ‌స్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు

Update: 2023-07-29 04:39 GMT

మ‌హారాష్ట్ర‌లోని బుల్దానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బ‌స్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మ‌రో 21 మంది గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం రాత్రి 2.30 నిమిషాల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మ‌ల్కాపూర్ ఏరియాలో ఉన్న నందూర్ నాకా ఫ్లైఓవ‌ర్ మీద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బాలాజీ ట్రావెల్స్‌కు చెందిన ఓ బ‌స్సు హింగోలి జిల్లాకు వెళ్తోంది. ఆ బ‌స్సులో అమ‌ర్‌నాథ్ నుంచి వ‌స్తున్న యాత్రికులు ఉన్నారు. రాయ‌ల్ ట్రావెల్స్ కంపెనీకి చెందిన మ‌రో బ‌స్సు నాసిక్ వెళుతోంది. నందూర్‌ నాకా వద్ద బస్సు ఒకటి ఓవర్‌టేక్‌ చేయడంతో రెండు ఢీకొన్నాయి. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన మరో 20 మందిని బుల్దానాలోని ఆసుపత్రిలో చేర్చారు. స్వల్ప గాయాలతో 32 మంది ప్రయాణికులకు సమీపంలోని గురుద్వారాలో ప్రథమ చికిత్స అందించారు. అమ‌ర్‌నాథ్ నుంచి తిరిగి వ‌స్తున్న బ‌స్సుకు చెందిన డ్రైవ‌ర్ ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు మీద నుంచి బ‌స్సుల్ని తొల‌గించిన త‌ర్వాత మ‌ళ్లీ ట్రాఫిక్‌ను పున‌రుద్ద‌రించిన‌ట్లు హైవే పోలీసులు వెల్ల‌డించారు.

బుల్దానా జిల్లాలో ఇటీవల జరిగిన రెండో అతిపెద్ద బస్సు ప్రమాదం ఇది. జూలై 1న, జిల్లాలోని సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలతో సహా 25 మంది సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.


Tags:    

Similar News