Breaking : మోస్ట్ వాంటెడ్ రియాజ్ ఎన్ కౌంటర్
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మరణించాడు
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మరణించాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ పై రియాజ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రమోద్ మృతి చెందాడు. దీంతో పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు నలభై కేసుల్లో రియాజ్ నిందితుడుగా ఉన్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. కానిస్టేబుల్ హత్యతో పోలీసు శాఖ అప్రమత్తమయింది.
గన్ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా...
తొమ్మిది బృందాలు రియాజ్ ను పట్టుకుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఆసుపత్రి నుంచి రిమాండ్ కు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా రియాజ్ కానిస్టేబుల్ గన్ లాక్కుని ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన రియాజ్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కు గాయాలయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరికాసేపట్లో పోలీసు కమిషనర్ మీడియాకు పూర్తి వివరాలు అందించనున్నారు.