Telangana : దారుణం ...కోడలిని హత్య చేసిన మామ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గర్భవతి అని చూడకుండా మామ కోడలిని హత్య చేశాడు

Update: 2025-10-18 12:31 GMT

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గర్భవతి అని చూడకుండా మామ కోడలిని హత్య చేశాడు. జిల్లాలోని దహేగాం మండలంలోని గెర్రే గ్రామంలో రాణి అనే తొమ్మిది నెలల గర్భవతిని ఆమె మామ సత్యనారయణ హత్య చేశాడు. హత్యకు గొడ్డలితో పాటు కత్తిని కూడా ఉపయోగించాడు. సత్యనారాయణ కుమారుడు శేఖర్ తమ ఎదురింట్లో ఉన్న రాణి యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

వేర్వేరు కులాలు కావడంతో...
అయితే ఇద్దరిదీ వేర్వేరు కులాలుకావడంతో సత్యనారాయణ ఆగ్రహించారు. ఈ పెళ్లి తరువాత రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాణి తల్లింట్లో ఒంటరిగా ఉన్న సందర్భాన్ని గమనించిన మామ గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.


Tags:    

Similar News