రైల్వే స్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియో ప్రసారం.. కాంట్రాక్ట్ రద్దు

ఫిర్యాదుపై జీఆర్‌పీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో.. ఆర్‌పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వే స్టేషన్‌లో టీవీలు..

Update: 2023-03-20 11:24 GMT

patna railway station

బీహార్ లోని పాట్నా రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం పోర్న్ వీడియో ప్రసారం కలకలం రేపింది. మార్చి 19 ఉదయం 9.30 గంటల సమయంలో స్టేషన్లో అమర్చిన పలు టీవీ స్క్రీన్లపై ఒక్కసారిగా పోర్న్ దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. మూడు నిమిషాలపాటు టీవీ స్క్రీన్లపై పోర్న్ వీడియో ప్లే అవడంతో.. స్టేషన్లో ఉన్న ప్రయాణికులంతా ఇబ్బంది పడ్డారు. వారిలో కొందరు వెంటనే రైల్వే పోలీసులకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై జీఆర్‌పీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో.. ఆర్‌పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వే స్టేషన్‌లో టీవీలు అమర్చిన కాంట్రాక్ట్ సంస్థ దత్తా కమ్యూనికేషన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆ ప్రసారాన్ని ఆపేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే అధికారులు సంస్థపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదవ్వగా.. రైల్వే శాఖ దత్తా కమ్యూనికేషన్స్‌ ను బ్లాక్ లిస్టులో పెట్టి, జరిమానా విధించింది. ఆ సంస్థతో కాంట్రాక్ట్‌ను రైల్వే శాఖ రద్దు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై రైల్వే శాఖ స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది.




Tags:    

Similar News