Breaking : రేవ్ పార్టీపై స్పీడ్ పెంచిన బెంగళూరు పోలీసులు.. మరికొందరు పోలీసులు అదుపులో

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2024-05-25 05:26 GMT

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు మరింత స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రేవ్ పార్టీలో వినియోగించిన డ్రగ్స్ పై ప్రశ్నించే అవకాశముంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అందులో ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

కాకాణి స్కిక్కర్ ను...
అందులో భాగంగా మరొక నిందితుడు పూర్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కారు స్టిక్కర్ ను వినియోగించిన వ్యక్తిని గుర్తించారు. ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించారన్న కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆరోజు పోలీసులు దాడిచేసినప్పుడు పూర్ణారెడ్డి ఫాం హౌస్ నుంచి పరారయ్యాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News