రూబీ హోటల్ ఘటన మృతుల్లో ఏడుగురు వీరు

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఏడుగురిని పోలీసులు గుర్తించారు

Update: 2022-09-13 11:43 GMT

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఏడుగురిని పోలీసులు గుర్తించారు. ఒక మృతదేహాన్ని మాత్రం గుర్తించలేదు. దానిని కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులు అల్లాడి హరీష్, బాలాజీ, వీరేంద్ర కుమార్, సీతారామన్, రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, మిధాలి పాత్రలుగా పోలీసులు గుర్తించారు.

జయంత్ పరిస్థిితి విషమం...
గాయాల బారిన పడి చికిత్స పొందుతున్న పది మందిలో బెంగళూరుకు చెందిన జయంత్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి గల కారణం స్కూటర్ల బ్యాటరీలు పేలడం వల్లనే జరిగిందని ప్రాధమికంగా గుర్తించారు. ఇంకా వివిధ శాఖల నుంచి నివేదిక అందాల్సి ఉంది.
స్పందించిన మానవ హక్కుల కమిషన్...
కాగా మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ చంద్రయ్య హోటల్ ను పరిశీలించారు. అక్కడకు చేరుకుని అధికారులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎనిమిది మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించిన కారణంగా కొందరు ప్రాణాలు దక్కాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News